: చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు: గుత్తా
'మన దేశంలో ఎలాంటి డిమాండ్ లేకుండా చేస్తున్న ఏకైక దీక్ష చంద్రబాబుదే' అని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబును తెలంగాణతో పాటు సీమాంధ్ర ప్రజలు కూడా నమ్మడంలేదని అన్నారు. కేంద్రంలో తన గత వైభవాన్ని సంపాదించుకోవాలన్న తపనే తప్ప... చంద్రబాబు దీక్షలో న్యాయం లేదని గుత్తా దుయ్యబట్టారు.