: తానుండగా విభజన జరగదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు: సచివాలయ ఉద్యోగులు
ముఖ్యమంత్రి కిరణ్.. ఉద్యమాన్ని తాను మోస్తానని, తాను పదవిలో ఉండగా రాష్ట్ర విభజన జరగదని హామీ ఇచ్చారని.. ఆయనపై ఉన్న నమ్మకంతోనే సమ్మెను విరమిస్తున్నామని సచివాలయ సీమాంధ్ర జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి విభజనను ఆపలేకపోతే తాము మళ్లీ రంగంలోకి దిగుతామని, మరోసారి మెరుపుసమ్మెకు దిగేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతానికి రాజకీయనాయకులు ఉద్యమం చేస్తామంటున్నారని, అందుకే తాము విరమణకు ఒప్పుకున్నామని ఆయన తెలిపారు.