: మలాలా పుస్తకాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు: తెహ్రీకే తాలిబాన్
పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్ రచించిన 'నేను మలాలా' పుస్తకాన్ని విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాక్ ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబాన్ హెచ్చరించింది. అవకాశం వస్తే మరోసారి మలాలాపై దాడి చేస్తామని ఈ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇస్లాం శత్రువుల నుంచి మలాలా అవార్డులను తీసుకుంటోందని తెహ్రీకే తాలిబాన్ ప్రతినిధి షహీదుల్లా అన్నారు. 'లౌకికవాదం కోసం మలాలా ఇస్లాంను పరిత్యజించింది. అందుకే ఆమెకు అవార్డులు ఇస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. మలాలాను చంపే అవకాశం వస్తే జారవిడుచుకోబోమని, ఆమె రాసిన పుస్తకాన్ని విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.