: ఏపీ భవన్లో ఉద్రిక్తత
ఢిల్లీలోని ఏపీభవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షాశిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాబు ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఆయనను దీక్ష విరమించాల్సిందిగా అభ్యర్థించారు. మరోవైపు భారీగా పోలీసులను మోహరించారు. దీంతో దీక్ష భగ్నం చేయడానికి వీల్లేదంటూ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు రక్షణగా నిలబడి నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.