: రెండు నెలల్లో రెడీ కానున్న షిర్డీ విమానాశ్రయం


డిసెంబర్ చివరికల్లా షిర్డీలో విమానాశ్రయ నిర్మాణం పూర్తవుతుందని మహారాష్ట్ర ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కంపెనీ ఎండీ సత్రి తెలిపారు. ఈ రోజు షిర్డీలో విమానాశ్రయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రన్ వే నిర్మాణం పూర్తి అయిందని, ఇతర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. షిర్డీ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో కాకడి వద్ద విమానాశ్రయ నిర్మాణం జరుగుతోంది. ఇందుకు షిర్డీ దేవస్థాన ట్రస్ట్ 45 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఎంతో మంది భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.

  • Loading...

More Telugu News