: విభజన నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేస్తాం: రాష్ట్ర పరిరక్షణ వేదిక


సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ రాష్ట విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని రాష్ట్ర పరిరక్షణ వేదిక వెల్లడించింది. విభజన విషయంలో ఒక కమిషన్ నివేదిక గానీ, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంగానీ లేకుండా పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని విభజిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. గతంలో జరిగిన రాష్ట్ర విభజనలు ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా జరిగాయని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అనేది విభజన ఎలా చేయాలో వివరిస్తుందని చెప్పారు. హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిరక్షణ వేదిక సమన్వయకర్త వి.లక్ష్మణ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది వి.రామకృష్ణలతో కలిసి హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి. లక్ష్మణరెడ్డి మాట్లాడారు.

  • Loading...

More Telugu News