: మంత్రుల బృందం నోటా సంప్రదింపుల మాటే..
ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ అంశంపై ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ముగిసింది. అనంతరం మంత్రుల బృందం ప్రకటన విడుదల చేసింది. ప్రధాన అంశాలపై అందరినీ సంప్రదించి సిఫార్సులు రూపొందిస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని మంత్రులు తెలిపారు. తమ బృందానికి నివేదికలు అందించాల్సిన మంత్రిత్వ శాఖలను గుర్తించినట్టు వారు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ సత్వరమే ఆరంభం అవుతుందని మంత్రుల బృందం ప్రకటనలో పేర్కొంది.