: కోర్టులో జగన్ మెమో దాఖలు
హైదరాబాద్ విడిచి వెళ్లరాదంటూ సీబీఐ కోర్టు విధించిన షరతును సడలించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెమో దాఖలు చేశారు. గత నెలలో జగన్ కు బెయిల్ ఇచ్చిన సీబీఐ న్యాయస్థానం అనుమతి లేనిదే నగరాన్ని విడిచి వెళ్లరాదంటూ షరతు పెట్టింది. ఈ నేపథ్యంలోనే జగన్ గుంటూరు వెళ్లేందుకు నిరాకరించింది కూడా.