: భయం గుప్పిట్లో ఇండో-పాక్ సరిహద్దు గ్రామాలు


భారత్, పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LOC) వద్ద ఉన్న కేరన్ సెక్టార్ వద్ద... మన దేశంలోకి చొరబడేందుకు యత్నించిన తీవ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నియంత్రణ రేఖ వద్ద ప్రశాంత వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తున్నా, సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలు భయం గుప్పిట్లో వణుకుతున్నాయి. రోజుల తరబడి సాగిన కాల్పులు, సైనిక దళాల సోదాలు, గ్రామాల్లో తిష్ఠవేసిన మిలిటరీ సిబ్బంది కార్యకలాపాలతో ఈ గ్రామాల్లోని జనజీవనం స్తంభించిపోయింది. కాల్పులు ఆగిపోయినా అక్కడి ప్రజల్లో భయం మాత్రం ఇంకా కొనసాగుతోంది. గత 10 నెలల కాలంలో దాదాపు 150 కాల్పుల ఉల్లంఘనలను ఈ ప్రాంత వాసులు చవిచూశారు.

మిలటరీ ఆపరేషన్ ముగియడంతో... గ్రామాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, ఏ క్షణంలోనైనా మరోసారి పాక్ కాల్పులకు తెగబడవచ్చని వారు భావిస్తున్నారు. అదే జరిగితే... మరోసారి నియంత్రణ రేఖ వెంబడి యుద్ధ వాతావరణం నెలకొంటుందని గ్రామస్తులు అంటున్నారు. తామందరం ఏ క్షణంలోనైనా తమ దుకాణాలు, ఇళ్ల తలుపులు మూసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వారంటున్నారు. ఈ ఒక్క మాట చాలు.. సరిహద్దుల్లోని ప్రజలు ఎలాంటి జీవనం గడుపుతున్నారో తెలుసుకోవడానికి.

  • Loading...

More Telugu News