: విజయనగరంలో 9 గంటల పాటు కర్ఫ్యూ సడలింపు
విజయనగరం జిల్లా కేంద్రంలో ఈ రోజు కర్ఫ్యూ 9 గంటల పాటు సడలించారు. దీంతో గత ఆరు రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఆరు రోజుల తరువాత అంగళ్లు తెరుచుకున్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతానికి విజయనగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.