: యూపీ కేబినెట్ విస్తరణ.. హత్యారోపణలు ఎదుర్కొన్న రాజాభయ్యాకు స్థానం


ఉత్తరప్రదేశ్ కేబినెట్ ను ముఖ్యమంత్రి అఖిలేశ్ సింగ్ యాదవ్ విస్తరించారు. దాదాపు మూడునెలల విరామం తర్వాత యూపీలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మార్చి (2013) నెలలో జియా ఉల్ హక్ అనే పోలీసు అధికారి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యాకు... కేబినెట్ లో మరోసారి స్థానం దక్కింది.

2013మార్చి 3న రాజాభయ్యా నియోజకవర్గంలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో జియా ఉల్ హక్ ను చంపేశారు. ఈ హత్య వెనుక రాజాభయ్యా హస్తం ఉందని సదరు పోలీసు అధికారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రెండుసార్లు సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. అయితే, రాజాభయ్యాకు ఈ హత్యతో సంబంధం లేదని సీబీఐ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. కేసు నేపథ్యంలో, ఆయన ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి పదవికి మార్చి నెలలో రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News