: దక్షిణ కొరియా మోస్ట్ పవర్ ఫుల్ సెలబ్రిటీగా 'గాంగ్నమ్' ఫేమ్ సై


ఒక్క పాటతో ప్రపంచాన్ని తనవైపుకి తిప్పుకున్న దక్షిణ కొరియా పాప్ స్టార్ సై ఇప్పుడు ఆ దేశంలో మోస్ట్ పవర్ పుల్ సెలబ్రిటీగా ఎంపికయ్యాడు. సై..  2012లో 'ఓపెన్ గాంగ్నమ్ స్టైల్' అంటూ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దాంతో ఈ 35 ఏళ్ల గాయకుడు ఒక్కసారిగా స్టార్ ఇమేజి సొంతం చేసుకున్నాడు. ఎక్కడ చూసినా గాంగ్నమ్ స్టైలే.

అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా దగ్గర్నించి మన షారూఖ్ ఖాన్ వరకు సైని అనుకరిస్తూ స్టెప్పులేశారు. స్వదేశంలో అయితే సై ఏకంగా హీరో నెంబర్ వన్నే. ఇటీవల  ఫోర్బ్స్ మ్యాగజైన్ దక్షిణ కొరియా విభాగం ఓ నలభై మందితో టాప్ సెలబ్రిటీస్ జాబితా ప్రకటిస్తూ సైకి అగ్రతాంబూలం అందించింది. ఇటీవలే దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా పార్క్ గ్వెన్ హే పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలోనూ సై తన ప్రదర్శనతో అదరగొట్టడం విశేషం. 

  • Loading...

More Telugu News