: యువరాజ్ మెరుపు ఇన్నింగ్స్ సచిన్ కు అంకితం


అది టీ20మ్యాచ్.. వేదిక రాజ్ కోట్.. భారత్ ముందు 202 పరుగుల భారీ విజయ లక్ష్యం! నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలలో ఉన్న భారత్ ను యువరాజ్ ఆదుకున్నాడు. చెలరేగి ఆడి 35 బంతుల్లో 77 పరుగులు సాధించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం యువీ మాట్లాడుతూ.. తన మెరుపు ఇన్నింగ్స్ ను సచిన్ టెండూల్కర్ కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు.

తాను తిరిగి టీమిండియాలోకి అడుగుపెట్టిన రోజే సచిన్ రిటైర్ మెంట్ ప్రకటించడంతో యువరాజ్ భాగోద్వేగానికి లోనయ్యాడు. 200వ టెస్ట్ మ్యాచ్ తర్వాత టెస్టుల నుంచి విరమిస్తానని సచిన్ నిన్న ప్రకటించిన విషయం విదితమే. దీనిపై యువరాజ్ స్పందిస్తూ.. 'బాల్ తో ఢీకొనడం సంతోషకరం.. సచిన్ రిటైర్ అవుతుండడం బాధాకరం' అంటూ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News