: గుజరాత్ కోర్టులో ఆశారాం, ఆయన కుమారుడు పిటిషన్


లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం, ఆయన కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సూరత్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరినట్లు వారి తరపు న్యాయవాది యతిన్ ఓజా తెలిపారు. కొన్ని రోజుల్లో పిటిషన్ విచారణకు రానుందని కూడా చెప్పారు. ప్రస్తుతం ఓ కేసులో అరెస్టయిన ఆశారాం జోధ్ పూర్ జైల్లో ఉండగా, పరారీలో ఉన్న కుమారుడు నారాయణ్ సాయికి ఇటీవలే పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News