: నేడు కోర్టుకు బాలీవుడ్ నటీమణులు


కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటీమణులు సొనాలీ బింద్రే, నీలమ్, టబు ఈ రోజు కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో సహ నిందితులైన నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లతో కలిసి ఈ నటీమణులు నిన్న జోధ్ పూర్ కు వచ్చారు. ఈ కేసులో ప్రధాన సాక్షి పూనం చంద్ ను నిన్న నిందితుల తరపు న్యాయవాదులు విచారించారు. కాగా, ఈ రోజు పూనం చంద్ తరపు న్యాయవాది నటీమణులను విచారించనున్నారు. ఓ చలన చిత్ర చిత్రీకరణ సందర్భంగా 1998 అక్టోబరులో జోధ్ పూర్ లోని కన్ కాని అనే ప్రాంతానికి వచ్చిన సల్మాన్ ఖాన్, అతని సహనటులు రెండు కృష్ణ జింకలను చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ ఘటనపై విచారణ ఈ ఏడాది జులై 6న మొదలైంది.

  • Loading...

More Telugu News