: తీర ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం
రేపు సాయంత్రం ఫైలిన్ తుపాను తీరాన్ని దాటనుండటంతో.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, భావనపాడు, బారువలో జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు అప్పుడే విధి నిర్వహణలోకి దిగాయి. సుమారు 10 వేల మందిని సహాయ శిబిరాలకు తరలించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అంతేకాకుండా, ఈ మధ్యాహ్నం నుంచి ఎల్లుండి ఉదయం వరకు ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.