: తీరానికి 590 కి.మీ దూరంలో ఫైలిన్ పెను తుపాను
పెను తుపానుగా రూపాంతరం చెందిన ఫైలిన్ తుపాను పారాదీప్ కు ఆగ్నేయ దిశలో 590 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు సాయంత్రం కళింగపట్నం-పారాదీప్ మధ్య గోపాల్ పూర్ వద్ద ఫైలిన్ తుపాను తీరం దాటనుంది. ప్రస్తుతం ఫైలిన్ గోపాల్ పూర్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 205 నుంచి 215 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అంతే కాకుండా, సముద్రంలోని అలలు రెండుమీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని వెల్లడించింది.