: మెనోపాజ్ సమస్యలకు యోగా మందు!
మెనోపాజ్ దశలో ఆడవారిలో పలురకాల సమస్యలు తలెత్తుతాయి. వాటిని దూరం చేసుకోవడానికి యోగా చక్కగా ఉపయోగపడుతుందట. సాధారణంగా మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో బరువు పెరగడం, చెమటలు పట్టడం, మానసికంగా ఒత్తిడికి గురికావడం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వాటిని యోగాతో దూరం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మెనోపాజ్ దశలో ఉన్న కొందరు ఆడవారితో పరిశోధకులు పన్నెండు వారాలపాటు రోజూ యోగా చేయించారు. యోగా చేయని వారితో వీరిని పోల్చి చూసుకుంటే వీరిలో ఆరోగ్యం బాగా మెరుగుపడినట్టు తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న మహిళలు యోగా చేయడం వల్ల తమకు చక్కగా నిద్ర కూడా పడుతోందని చెప్పారట. అయితే కేవలం ఒక్క యోగాతోనే కాదు పలురకాలైన చిన్నపాటి వ్యాయామం వల్ల కూడా మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చని, సుమారు 249 మందిపై చేసిన పరిశోధనలో నిపుణులు ఈ విషయాన్ని తేల్చారు.