: ఇందులో తాంబూల సేవనం చాలా కాస్ట్‌లీ!


అనగనగా ఒక తాంబూలపు పెట్టె. ఇది చాలా పురాతనమైంది. అయితే మాత్రం... అనుకుంటున్నారా... అయితే ఇందులో తాంబూలం వేసుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అదేంటి... అదేమన్నా బంగారపు పెట్టెనా... లేక బంగారపు తాంబూలమా... అనుకుంటున్నారా... ఆ తాంబూలపు పెట్టె మాత్రం బంగారపు పెట్టే. అందులోని తాంబూలం సంగతి పక్కనపెడితే అది పురాతన కాలానికి చెందినది. కాబట్టి దాన్ని వేలం వేస్తే... అజ్ఞాత వ్యక్తులు దాన్ని ఎక్కువ ధర పెట్టి సొంతం చేసుకున్నారు.

18వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఒక బంగారపు తాంబూలపు పెట్టెను వేలానికి పెట్టారు. సొతెబీస్‌ సంస్థ 'ఆర్ట్‌ ఆఫ్‌ ఇంపీరియల్‌ ఇండియా' అనే పేరుతో భారత దేశానికి చెందిన పలు రకాలైన అరుదైన వస్తువులను వేలం వేసింది. ఈ వేలానికి భారీగానే స్పందన లభించింది. ఈ వేలంలో ఈ బంగారపు తాంబూలపు పెట్టెను వేలం వేయగా అది అక్షరాలా రూ.6.58 కోట్లు పలికిందట. అంతేకాదు... ఈ వేలంలో పలు రకాలైన అరుదైన వస్తువులు, కళాఖండాలు రూ.18.25 కోట్ల ధర పలికాయట.

  • Loading...

More Telugu News