: ఆర్టీసీ కార్మికులతో రేపు బొత్స మరోసారి చర్చలు
రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి చర్చలు జరపనున్నారు. ఈ రోజు జరిపిన చర్చల్లో ఈయూ, ఎన్ఎంయూ నేతలు సమ్మె నిలుపుదలపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. దాంతో, రేపు సాయంత్రం బస్ భవన్ లో మంత్రి వారితో సమావేశమవుతారు. సమ్మె విరమణపై రేపు నిర్ణయం ప్రకటిస్తామని ఆర్టీసీ కార్మిక నేతలు స్పష్టం చేశారు. అంతకుముందు చర్చల సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లపై బొత్స సానుకూలంగా స్పందించారు.