: భారత జట్టుకు ఆడాలన్నది జీవితకాల స్వప్నం: సచిన్


టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సచిన్ ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. భారత జట్టుకు ఆడాలన్నదే తన స్వప్నమని తెలిపాడు. గత 24 ఏళ్ళుగా ఆ కలతోనే ప్రస్థానం సాగిస్తున్నట్టు వివరించాడు. 11 ఏళ్ళ వయసు నుంచి తాను క్రికెట్ ఆడుతున్నానని, ఇక విరమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. ఈ మేరకు బీసీసీఐకి సమాచారం అందించానని పేర్కొన్నాడు. చారిత్రక టెస్టును సొంతగడ్డపై ఆడాలని ఆంకాక్షిస్తున్నట్టు చెప్పాడు. కెరీర్ లో తన అభ్యున్నతికి సహకరించిన బీసీసీఐ, తోటి క్రికెటర్లకు, అభిమానులకు సచిన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.

  • Loading...

More Telugu News