: మన్మోహన్, సోనియా నా రాజకీయ గురువులు: రాహుల్
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన రాజకీయ మార్గదర్శకులని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలు అనేకమని, ఆయన చేసినన్ని సేవలు ఎవరూ చేయలేదని కీర్తించారు. పంజాబ్ లోని సంగ్రుర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా ప్రజల మధ్య (హిందు, ముస్లిం) ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ, ఎస్పీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.