: శ్రీశైలంలో వీరశైవ సంఘాలు, అర్చకుల మధ్య వాగ్వివాదం
శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో వీరశైవ సంఘాలు, ఆలయ అర్చకుల మధ్య వాగ్వాదం జరిగింది. మూలవిరాట్ కు బంగారు తొడుగు ఏర్పాటు చేయడంపై చర్చించడానికి వీరు సమావేశమయ్యారు. అయితే వీరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఇరు వర్గాలు శాంతించకపోవడంతో అది చివరకు వాగ్వివాదానికి దారితీసింది. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.