: బంజారాహిల్స్ లో కుంగిపోయిన రోడ్డు
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లో కేర్ ఆసుపత్రి వద్ద రోడ్డు కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. దీని వల్ల వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కోఠి, మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, రహదారులు భవనాల శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పి వెళ్లిపోయారు. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.