: జగన్ ను కలిసి, మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ
అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వైఎస్సార్సీపీ నేత జగన్ ను కలిశారు. లోటస్ పాండ్ లోని నివాసంలో సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేస్తున్న జగన్ ను గతరాత్రి కలిసిన అనంత ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అనంత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నందుకే జగన్ కు మద్దతు తెలిపానని వివరించారు. కాగా, తమను కేంద్రం దారుణంగా మోసం చేసిందని ఆయన వాపోయారు. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నోట్ ను కేబినెట్ ముందుకు తెస్తామని చెప్పిన కేంద్రం మాట తప్పిందని అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేస్తామని చెప్పిన కేంద్రం, హామీలను తుంగలోతొక్కిందని మండిపడ్డారు.