: భారత్ లో పాక్ హైకమిషనర్ గా సయ్యద్ అబ్బాస్
భారత్ లో పాకిస్థాన్ కొత్త హైకమిషనర్ గా సయ్యద్ ఇబ్నే అబ్బాస్ నియమితులయ్యారు. సల్మాన్ బషీర్ స్థానంలో ఆయనను నియమిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. అబ్బాస్ ప్రస్తుతం ఢిల్లీలోని హైకమిషన్ కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా పని చేస్తున్నారు. మరోవైపు ఆయన పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలో కాశ్మీర్ వ్యవహారాల డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నియామకంతో పాటు పలు దేశాలకు కూడా పాక్ రాయబారులను నియమించింది.