: నోబెల్ బహుమతికి నేను అర్హురాలిని కాదు: మలాలా


విఖ్యాత నోబెల్ బహుమతికి తాను అర్హురాలిని కాదని పాక్ బాలిక మలాలా యూసఫ్ జాయ్ పేర్కొంది. ఈ ఏటి నోబెల్ శాంతి పురస్కారానికి మలాలా పేరు కూడా ప్రతిపాదనల్లో ఉంది. ఆమెకు ఇవ్వాలనే డిమాండ్లు, ఆమెకే వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై మలాలా స్పందించింది. నోబెల్ శాంతి బహుమతి పొందేటంత స్థాయిలో తానేమీ చేయలేదంటూ తన వినమ్రతను చాటుకుంది. నోబెల్ శాంతి పురస్కారానికి అర్హులైన వారు ఎంతో మంది ఉన్నారని, తాను ఇంకా ఎంతో చేయాల్సి ఉందని తెలిపింది. గతేడాది పాక్ లోని స్వాత్ లోయలో తాలిబాన్ల కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత మలాలా సాహస బాలికగా, బాలికల విద్యా హక్కుల కార్యకర్తగా, ప్రపంచవ్యాప్తంగా ఒక సెలబ్రిటీగా మారిపోయిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News