: అమ్మవారి సేవలో సినీనటుడు రాజేంద్రప్రసాద్
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన... తొలుత భవానీ దీక్ష మంటపంలో దుర్గమ్మకు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, వీరికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందజేశారు.