: రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాదును యూటీ చేయాలి: రాయపాటి


రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాలకు చెరో రాజధాని ఇచ్చి హైదరాబాదును యూటీ చేయాలని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనలాంటివారంతా నామరూపాల్లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఎన్టీఆర్ ప్రభంజనం సమయంలో కూడా గుంటూరులో కాంగ్రెస్ పార్టీకి తాము విజయాన్ని కట్టబెట్టామని చెప్పుకొచ్చారు. కానీ, కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలు తీసుకుందని ఆయన మండిపడ్డారు. సీమాంధ్రలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులు, ప్రజలు, ఉద్యమకారులకు పూర్తి మద్దతు పలుకుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News