: ఢిల్లీ హైకోర్టులో గుత్తా జ్వాలకు ఊరట
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను టోర్నమెంట్లలో ఆడేందుకు అనుమతించాలని బాయ్ (భారత బ్యాడ్మింటన్ సంఘం)ని ఆదేశించింది. అంతేగాకుండా బాయ్ తీసుకున్న జీవితకాల నిషేధం నిర్ణయంపై స్టే విధించింది. న్యాయస్థానం తీర్పుపై స్పందించిన జ్వాల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఐబీఎల్ మ్యాచ్ లలో జ్వాల ప్రవర్తనపై తలెత్తిన వివాదం కారణంగా జీవితకాల నిషేధం విధించాలని బాయ్ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. దాంతో, క్షమాపణ చెప్పేంతవరకు టోర్నీలకు ఎంపిక చేయకూడదని బాయ్ తీసుకున్న నిర్ణయంపై నిన్న ఆమె కోర్టును ఆశ్రయించింది.