: బాబు పాదయాత్రలో మారణాయుధాలతో వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు


కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వాహనం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి గొడ్డలితో పాటు మరికొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

బాబు ప్రస్తుతం కూచిపూడి వద్ద పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కాగా, అరెస్టయిన వ్యక్తి నల్గొండ జిల్లా మర్రివాడ కు చెందిన నాటు వైద్యుడు రాజు అని తెలుస్తోంది. అయితే, బాబును చూసేందుకే తాను అక్కడికి వచ్చినట్టు అతను పోలీసులకు తెలిపాడు. ఇందులో ఎలాంటి కుట్రలేదని తాము భావిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జె. ప్రభాకర్ చెప్పారు. 

  • Loading...

More Telugu News