: సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాకే 'టి బిల్లు' ఆమోదించాలి: బీజేపీ


రాష్ట్ర విభజనకు మొదటి నుంచి ఒకే అభిప్రాయంపై ఉన్న భారతీయ జనతా పార్టీ సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పార్టీ భవిష్యత్ ను రక్షించుకునేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే, సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించిన తర్వాతే పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించాలని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. గత 70 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహించారు. ప్రజల మధ్య చీలికలు తెచ్చి రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. విభజించాల్సింది ప్రజలను కాదని, రాష్ట్రాన్నని హితవు పలికారు.

  • Loading...

More Telugu News