: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై సుప్రీంలో పిటిషన్


చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వచ్చే ఏడాది ఐపీఎల్ వేలానికి ఈ రెండు జట్లకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఆరవ సీజన్ లో చెన్నై,రాజస్థాన్ కు చెందిన ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలతో ముగ్గురు వ్యక్తులతో కూడిన ఓ ప్యానల్ ప్రస్తుతం దర్యాప్తు చేపట్టింది. ఇది పూర్తయ్యేంతవరకు రెండు జట్లను అనుమతించరాదని కోరినట్లు వర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News