: జ్వాలకు షాకిచ్చిన బ్యాడ్మింటన్ సంఘం


ఐబీఎల్ సందర్భంగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ స్మాషర్స్ జట్టులోని కీలక ఆటగాళ్ళను బంగా బీట్స్ తో ఆడకుండా నిలువరించిందని ఆరోపణలెదుర్కొంటున్న స్టార్ షట్లర్ గుత్తా జ్వాలకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) షాకిచ్చింది. ఆమెను డెన్మార్క్ ఓపెన్ టోర్నీకి ఎంపిక చేయకుండా 'బాయ్' తన పంతం నెగ్గించుకుంది. ఐబీఎల్ లో జ్వాల వ్యవహారశైలిపై విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ జీవితకాల నిషేధానికి సిఫారసు చేయగా.. క్షమాపణ చెబితే ఆమెను భారత జట్టు ఎంపిక సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటామని బాయ్ స్పష్టం చేసింది. అయితే, జ్వాల ఈ విషయమై ఢిల్లీ హైకోర్టుకెక్కిన నేపథ్యంలో 'బాయ్' అన్నంతపనీ చేసింది. జాతీయ జట్టు ఎంపిక సందర్భంగా ఆమెను నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టింది. కాగా, డెన్మార్క్ ఓపెన్ వచ్చే వారం జరగనుంది.

  • Loading...

More Telugu News