: లంచ్ వేళకు ఆసీస్ స్కోరు 83/4


హైదరాబాద్ లో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆసీస్ కష్టాలు తీరేట్టు కనిపించడంలేదు. ఈ రోజు ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఆసీస్ లంచ్ లోపే టాపార్డర్ ను కోల్పోయింది. ఓపెనర్లు 15 పరుగులకే వెనుదిరగ్గా.. మరో 48 పరుగుల తేడాతో వాట్సన్, హ్యూస్ (19) అవుటవడంతో కంగారూలు కష్టాల్లో పడ్డారు.

ఉదయం పూట పిచ్ పై తేమను సద్వినియోగం చేసుకున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో ప్రత్యర్థి పనిబట్టాడు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కూడా ఓ వికెట్ తీయడంతో ఆసీస్ మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది. లంచ్ విరామానికి కంగారూల స్కోరు  83/4 కాగా, ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ క్లార్క్ (20 బ్యాటింగ్), వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (2 బ్యాటింగ్) ఉన్నారు. 

  • Loading...

More Telugu News