: లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వానికి తెరతీసిన ములాయం
2014లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సమాజ్ వాది పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుని... కేంద్రంలో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా, ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 బహిరంగ సభలను నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 29న మొట్టమొదటి భారీ బహిరంగ సభను అజాంగఢ్ లో నిర్వహించడానికి ఎస్పీ శ్రేణులను సమాయత్తం చేశారు. అన్ని సభలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఇప్పటికే రెడీగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు, విదేశాల్లో ఉన్న యూపీ ఎన్నారై ఓట్లు కూడా సమాజ్ వాది పార్టీకే పడేలా చూసేందుకు ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ములాయం తన పార్టీ వర్గాలకు సూచించారు.