: ఈ మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీతో బొత్స చర్చలు
రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలకు పిలిచారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరుతూ బొత్స మరోసారి ప్రయత్నం చేయనున్నారు.