: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఈవో రౌడీయిజం
ఓ దేవాలయానికి కార్వనిర్వహణాధికారి అంటే అతను విధుల్లో ఇతర ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ, బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం ఈవో ప్రభాకర్ మాత్రం క్రమశిక్షణ తప్పాడు. అమ్మ గర్భగుడిలోనే రౌడీ అవతారం ఎత్తాడు. తన కింది ఉద్యోగి దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను కాలితో తన్ని వీధి రౌడీని తలపించాడు. భక్తులు, సిబ్బంది సమక్షంలో ఈవో.. సూపరింటెండెంట్ పై దాడి చేయడంతో.. వారంతా నిశ్చేష్టులయ్యారు. తేరుకున్న తర్వాత ఈవో ప్రభాకర్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ ఉద్యోగులు కూడా ఈవో చర్యను తప్పుబడుతున్నారు. వివాదం ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలేగానీ, పరమ పవిత్రంగా భావించే గర్భగుడిలో అమ్మవారి ఎదుట దాడి చేయడం ఏమిటంటూ భక్తులు కూడా మండిపడుతున్నారు.