: లిబియా ప్రధాని కిడ్నాప్
లిబియా ప్రధాని అలీ జియాదన్ కిడ్నాప్ కు గురయ్యారు. లిబియా రాజధాని ట్రిపోలీలో ఉన్న ఒక స్టార్ హోటల్ నుంచి ఆయనను కిడ్నాప్ చేసినట్టు అరబ్ టెలివిజన్ ఛానెల్స్ వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఆయుధాలు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు జియాదన్ ను కిడ్నాప్ చేశారు. ఈయనను తిరుగుబాటుదారులే అపహరించి ఉంటారని సమాచారం.