: హెలి స్కాంలో త్యాగీని విచారించనున్న సీబీఐ!
సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ లాండు హెలి స్కాం వ్యవహారంలో మాజీ ఎయిర్ ఫోర్సు చీఫ్ ఎస్పీ త్యాగీని వచ్చేవారం సీబీఐ విచారించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో సంబంధం ఉందని అనుమానిస్తున్నఆయన బంధువులను కూడా సీబీఐ విచారణ చేస్తుందని సమాచారం.
2010లో ఆంగ్లో-ఇటాలియన్ కు చెందిన కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లను రూ.4వేల కోట్లకు కొనేందుకు భారత్ ఒప్పం
అయితే తన పదవీకాలం పూర్తయిన 3 సంవత్సరాల తర్వాత హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకున్నారని త్యాగీ చెబుతున్నారు. కానీ, తానున్న సమయంలో హెలికాప్టర్ల టెండర్ సవరణ మాత్రమే చోటు చేసుకుందని తెలిపారు. దానివల్లే అగస్టాకు ప్రయోజనం చేకూరిందని ఇటాలియన్ విచారణ అధికారులు అంటున్నారు. గత వారంలో ఇటలీకు వెళ్లిన సీబీఐ అధికారులు ముఖ్యమైన ఆధారాల డాక్యుమెంట్లు సేకరించిన సంగతి తెలిసిందే.