: మరింత బలపడి పెను తుపానుగా మారనున్న ఫైలిన్ తుపాను


తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను స్థిరంగా కొనసాగుతోంది. దీనికి ఫైలిన్ తుపానుగా నామకరణం చేశారు. రానున్న 24 గంటల్లో ఫైలిన్ తుపాను మరింత బలపడి పెను తుపానుగా మారనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఈ తుపాను విశాఖ తీరానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 12న కళింగపట్నం-పారాదీప్ మధ్యలో ఇది తీరాన్ని దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. దీంతో, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. పెను తుపాను నేపథ్యంలో, అన్ని ఓడరేవులలో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

  • Loading...

More Telugu News