: ఇద్దరు మహిళల దారుణ హత్య


మెదక్ జిల్లా గజ్వేలు మండలంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు మహిళలను దారుణంగా హతమార్చారు. ఈ రోజు ఉదయం పొలాల్లోకి వెళ్తున్న స్థానికులు వీరి మృత దేహాలను గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన మహిళలు ఎవరో ఇంకా తెలియరాలేదు. గుర్తు తెలియని ఆగంతకులు వీరిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హతమార్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీఐ, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News