: నేడు భారత్-ఆస్ట్రేలియా ఏకైక టీ20... వర్ష సూచన
భారత్ లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈ మ్యాచ్ రాజ్ కోట్ లో జరగబోతోంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ క్రికెట్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న విషయం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే, ఈ రోజు రాజ్ కోట్ లో వర్షం పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.