: ఆ దీవులు ఎలా ఏర్పడ్డాయంటే...


భూమిపైన ఉన్న సుందర ప్రదేశాల్లో హవాయి దీవులు ఒకటి. ఈ దీవులు సహజసిద్ధంగా ఏర్పడలేదట. అవి అగ్ని పర్వతం బద్దలు కావడం వల్ల ఏర్పడినవని పరిశోధకులు తాజా అధ్యయనాల్లో తేల్చారు. చాలా కాలంగా సుందరమైన హవాయి దీవులు ఎలా ఏర్పడి ఉంటాయి? అనే విషయంపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

రోడీ ఐలాండ్‌ యూనివర్సిటీకి చెందిన ఆస్టర్‌ ఫ్లైండర్‌ అతని సహ అధ్యయనకర్తలు భూమ్యాధారిత ఆకర్షణపై చేసిన సర్వే, భూభౌతిక సమాచారం ఆధారంగా నిర్వహించిన సముద్ర సర్వేల సహాయంతో హవాయి దీవులు అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడ్డాయిని కనుగొన్నారు. శిలాద్రవ అంతర్గత ఘనీభవన కారణంగా ఏర్పడినాయని ఇప్పటి వరకూ ఉన్న అభిప్రాయాన్ని ఈ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనం మార్చివేసింది. ఈ పరిశోధన జరగకముందు శిలాద్రవం భూమి ఉపరితలానికి చేరకుముందే గట్టిపడడం వల్ల ఇవి ఏర్పడినాయని పలువురు శాస్త్రవేత్తలు భావించేవారు. ఈ తాజా అధ్యయనం ద్వారా హవాయి దీవుల్లోని కిలాయో తూర్పు చీలిక భాగం అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడిరదని, అయితే మొత్తం దీవులన్నీ కచ్చితంగా ఇలాగే ఏర్పడివుంటాయని చెప్పలేమని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News