: అల్ ఖైదా హిట్ లిస్టులో సాల్మన్ రష్దీ


ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా భారత సంతతి రచయిత సాల్మన్ రష్దీని హిట్ లిస్ట్ లో చేర్చింది. ఇస్లామ్ పట్ల విమర్శనాత్మక వైఖరి అనుసరిస్తున్న కారణంగానే రష్దీ పేరును హిట్ లిస్టు లో చేర్చి ఉంటారని ఓ ఆన్ లైన్ మ్యాగజైన్ వెల్లడించింది.

ఇన్ స్పైర్ అనే ఈ మ్యాగజైన్ తాజాగా ' వాంటెడ్: డెడ్ ఆర్ అలైవ్' పేరిట అల్ ఖైదా హిట్ లిస్టును బయటపెట్టింది. దాంట్లో రష్దీయే కాకుండా 9/11 దాడుల అనంతరం ఖురాన్ ను దహనం చేసిన అమెరికన్ పాస్టర్ టెర్రీ జోన్స్ కూడా ఉన్నారు.

కాగా, గతంలో రష్దీ తన 'శాటానిక్ వర్సెస్' పుస్తకంలో రాసిన వివాదాస్పద వ్యాఖ్యలపై 1989లోనే ఇరాన్ దివంగత నేత ఆయతొల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేశారు. ఇరాన్ లోని ఖొర్దాద్ ఫౌండేషన్ రష్దీని చంపిన వారికి రెండున్నర మిలియన్ పౌండ్లను బహుమానంగా ప్రకటించింది కూడా. అప్పట్నించి రష్దీ అజ్ఞాతంలో ఉండడానికే ప్రాధాన్యత ఇచ్చారు. రష్దీ ప్రస్తుతం బ్రిటీష్ పౌరసత్వం స్వీకరించారు. 

  • Loading...

More Telugu News