: భూమికి సమీపంగా రానున్న జూనో
అంతరిక్షంలోని గ్రహాల పరిశోధనకు పంపిన మానవ నిర్మిత అంతరిక్ష వాహనం భూమికి సమీపానికి రానుంది. సాధారణంగా అంతరిక్ష వాహనాలు భూమి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా శక్తిని సముపార్జించుకుంటాయి. ఇలా శక్తిని సముపార్జించుకోవడానికి జూనో భూమికి సమీపానికి రానుంది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గురుగ్రహంపై పరిశోధనకు పంపిన అంతరిక్ష వాహనం జూనో శక్తిని పుంజుకోవడానికి భూమి మీదుగా దూసుకెళ్లనుంది. ఇలా దూసుకెళ్లి 2011లో ప్రయోగించిన జూనో గురుగ్రహానికి వెళ్లే క్రమంలో భూమిపైనుండి భారత తూర్పుతీరం మీదుగా వెళ్లనుంది. 2016 జూలై 4 నాటికి గురుగ్రహానికి చేరుకోనుంది. సౌరకుటుంబం వెలుపల అంతరిక్ష వాహనానికి శక్తిని సముపార్జించుకోవడానికి భూమి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకునే క్రమంలో ఇది ఇలా భూమి మీదుగా భూమి ఉపరితలానికి 350563 కిలోమీటర్ల దూరం నుండి దక్షిణాఫ్రికా తీరం మీదుగా వెళ్లనుంది. ఈ సందర్భంగా అంతరిక్ష వాహనంలోని జూనో క్యామ్ భూమిని, చంద్రుడిని ఫోటోలు తీయనుంది. వాతావరణం అనుకూలిస్తే భారత, దక్షిణాఫ్రికాల్లోని ఔత్సాహికులు బైనాక్యులర్స్, చిన్న టెలిస్కోపుల ద్వారా ఈ అరుదైన చిత్రాన్ని చూడవచ్చు.