: ఈ క్లిప్‌ చాలా ఉపయోగపడుతుంది


వాహనాల బ్యాటరీనుండి సెల్‌ఫోన్‌ ఛార్జ్‌ చేసుకోవడానికి ఒక సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరికరం సాయంతో కారు బ్యాటరీనుండి సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన కొందరు ఇంజనీర్లు వాహనాల బ్యాటరీల్లో నిల్వ ఉన్న శక్తిని సెల్‌ఫోన్‌కు అందించే ఒక సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరానికి 'పవర్‌ క్లిప్‌'. ఈ క్లిప్‌ ద్వారా కారు బ్యాటరీ నుండి సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. దీన్ని యూఎస్‌బీ సాయంతో బ్యాటరీకి అనుసంధానించి ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసుకోవచ్చని దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా చవకగా లభిస్తుందని, తిరుగులేని పరికరమని, అత్యవసర సమయాల్లో ఈ క్లిప్‌ చక్కగా ఉపయోగపడుతుందని పవర్‌క్లిప్‌కి సంబంధించిన వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News