: రేపు శ్రీహరి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో..
ఈ రోజు సాయంత్రం ముంబైలో తుదిశ్వాస విడిచిన సినీ నటుడు శ్రీహరి అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం బాచుపల్లి (హైదరాబాదు శివారు)లోని ఫాంహౌస్ లో నిర్వహించనున్నట్టు నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. రేపు ఉదయం శ్రీహరి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు. అనంతరం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.