: పైలట్ కు అస్వస్థత... విమానాన్ని ల్యాండ్ చేసిన ప్రయాణికుడు
నమ్మలేకపోయినా... ఇది నిజం. ఈ ఘటన బ్రిటన్ లో జరిగింది. ప్రయాణికుడు విమానాన్ని ల్యాండ్ చేయడం ఒక విచిత్రమైతే... అతనికి విమానం నడపడం గురించి ఏ మాత్రం తెలియకపోవడం మరో విచిత్రం. వివరాల్లోకి వెళితే... బ్రిటన్ లోని యార్క్ షైర్ ప్రాంతం నుంచి బయలుదేరిన నాలుగు సీట్ల సెస్నా-172 విమానం గాల్లో ఉన్నప్పుడు సడన్ గా పైలట్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని నడపలేకపోతున్నానని గ్రౌండ్ కంట్రోల్ కి మెసేజ్ పంపాడు. విమానంలో పైలట్ తో పాటు మరో ప్యాసింజర్ మాత్రమే ఉన్నాడు. పైలట్ అచేతనుడు అయిపోయినప్పటికీ, అధైర్య పడకుండా విమానాన్ని కంట్రోల్ చేయడానికి ఆ వ్యక్తి ప్రయత్నించాడు. గ్రౌండ్ కంట్రోల్ నుంచి అందుతున్న సూచనలతో విమానాన్ని కంట్రోల్ చేశాడు. నాలుగో ప్రయత్నంలో విజయవంతంగా విమానాన్ని రన్ వే పై ల్యాండ్ చేశాడు. జరిగిన సంఘటన నిజంగా ఒక అద్భుతమే అని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అయితే, విషాదం ఏమిటంటే.. విమానం ల్యాండ్ అయిన కాసేపటికే పైలట్ మరణించాడు. ప్రయాణికుడి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు