: శ్రీహరి 'రియల్' స్టార్


అనారోగ్యంతో కన్నుమూసిన సినీ నటుడు శ్రీహరి నిజంగానే రియల్ స్టార్. కుమార్తె నెలల వయసులోనే చనిపోవడంతో ఆయన ఆ పాప పేరిట అక్షర ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ సమీపంలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అత్యధిక పారితోషికం అందుకునేది శ్రీహరే. చిన్న చిత్రాల్లో నటించినా తనదైన శైలితో రాణించి అభిమానులను అలరించడం ఆయనకే చెల్లింది. విభిన్నమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే శ్రీహరి తెలంగాణ యాసతో కామెడీని పండించడంలో దిట్ట. రామ్ చరణ్ చిత్రం 'మగధీర' లో షేర్ ఖాన్ పాత్ర ఆయనకు పేరు తెచ్చిపెట్టింది.

  • Loading...

More Telugu News